ఘనంగా జయశంకర్ 92వ జయంతి వేడుకలు
కొత్తగూడెం: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలను గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయంలోని హెచ్‌ఆర్‌డీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.జీఎం (పర్సనల్–వెల్ఫేర్, సీఎస్‌ఆర్ & సెక్యూరిటీ) కే. అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జనరల్ మేనేజర్ (ఎంపీ) టి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ సెక్రటరీ ఎస్‌వీ రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం (ఐఎన్‌టీయూసీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి. త్యాగరాజన్, కార్పొరేట్ సీఎంఓఏఐ ఉపాధ్యక్షుడు కేశవరావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించిన జయశంకర్ ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా సేవలందించారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఆశయాలు భావితరాలకు చేరేలా జయంతి వేడుకలను నిర్వహించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.అనంతరం ముఖ్య అతిథులు, యూనియన్ నాయకులు, శాఖాధిపతులు, అధికారులు, ఉద్యోగులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జీఎం (ఈ&ఎం) ఓసినప్ పి. ఎలిషా, జీఎం (పర్సనల్–ఐఆర్ & పీఎం) జి.వి. కిరణ్ కుమార్, జీఎం (పర్సనల్–ఈఈ & ఆర్‌సీ) ఏజేఎం మురళీధరరావు, సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి. రాజేంద్రప్రసాద్, జీఎం (ఈ&ఎం) యూజీ మైన్స్ కే. యాదయ్య, డీజీఎం (పర్సనల్–వెల్ఫేర్) బి. శివకేశవరావు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
