అరెస్టులు కాదు...హమీలు అమలు చేయండి.
కుల్కచర్ల, వికారాబాద్: అరెస్టులు కాదు హమీలు అమలు చేయాలని బీఆర్ఎస్ కుల్కచర్ల మండల మాజీ రైతు సమితి అధ్యక్షులు పీరంపల్లి రాజు సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్ లో నిర్వహించనున్న ధర్నా నేపథ్యంలో కుల్కచర్లలో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్దంగా నిరసనలు చేపడితే అరెస్టులు చేయడం అన్యాయం అన్నారు. అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన విధంగా గుణపాఠం చెబుతారని తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


