వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యంపై గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.

వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యంపై గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.

నిర్మల్ : స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా విబిజి రామ్ జి, సెర్ప్ సిబ్బందితో జిల్లా గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ, చెత్తను వివిధ పద్ధతుల్లో వేరు చేయడం, తగ్గించడం, పునర్వినియోగం, పునరుత్పత్తి పద్ధతులను ప్రోత్సహించడం పై కూలంకషంగా వివరించారు. వ్యర్థాల నుండి సంపద సృష్టించే విధానాలు, పరిశుభ్రత, పారిశుధ్యం, చెత్త నిర్వహణ పద్ధతులపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా వికసించాలంటే సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమని, పర్యావరణహిత స్థిరమైన జీవన పద్ధతులను పెంపొందించుకోవాలని వివరించారు. అనంతరం అందరూ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-19 at 3.15.39 PM (1)

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు 14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు
  సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 
తాడాన్‌పల్లిలో కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ
లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు
పదవి బాధ్యత కి కష్టపడి పని చేయాలి 
 ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి - CSFI డిమాండ్
గోండు గూడలో ఎస్పీ అఖిల్ మహాజన్ జనదర్బార్.