తులం బంగారం ఎగ్గొటెందుకు కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాలకు ఎసరు
వనపర్తి : ఆడబిడ్డల ఆర్థిక భరోసా, ఆత్మగౌరవాన్ని నిలిపే కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాలు ఆపే కుట్ర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అంతు తెలుస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కుట్రలపై బి.ఆర్.ఎస్ కదనభేరి పేరిట రాజీవ్ చౌరస్తాలో మంగళవారం నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమములో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.తమ హక్కులు కాపాడుకోవడానికి,కె.సి.ఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఉప్పెనల తరలివచ్చిన మహిళలను నిరంజన్ రెడ్డి అభినందించారు. కె.సి.ఆర్ తన మానస పథకాలు కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాలు రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తే అంతు తెలుస్తామని హెచ్చరించారు. అనాడు ఆడపిల్లల ఆత్మగౌరాన్ని,ఆర్థిక భరోసా నిలబెట్టడానికి కె.సి.ఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాలు ప్రారంభించారని కానీ నేటి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన హామీ తులం బంగారంపైమహిళల నుండి వస్తున్న నిరసనను తట్టుకోలేక హైకోర్టులో వేసిన పిటిషన్ లకు కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చేసి కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాల రద్దుకు కుట్ర చేస్తుందని అన్నారు.బాల్య వివాహాలు నిరోధించడానికి పేదప్రజల పేగుబంధాన్ని కాపాడడానికి 2014అక్టోబర్ 14 న 50116రూపాయలతో ప్రారంభించి 100116రూపాయలకు పెంచి కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాలు కొనసాగించారని అన్నారు.2014 నుండి 2023వరకు 13లక్షల 50వేల మందికి 14వేల కోట్లు కె.సి.ఆర్ గారు ఇచ్చారని గుర్తు చేశారు.కరోనా కాలములో కూడా కె.సి.ఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాధిముబారక్ పథకాలతో పాటు లక్షలాది మంది మహిళలకు కె. సి.ఆర్ కిట్టు అందించారని కొనియాడారు. 30రోజులలో స్టే పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఉన్నా ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుతం నిరక్ష్యం చేసిందని గౌరవ నిరంజన్ రెడ్డి ఆరోపించారు.దశల వారీగా పథకాన్ని రద్దు చేయడానికి కాంగ్రెస్ పార్టీ 2024నుండి 2025 వరకు 1లక్షా 58వేల మందికి,2025నుండి2026 వరకూ కేవలం 86 వేల మందికి మాత్రమే కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాలు అందించిందని దుయ్యబట్టారు.కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాలు కొనసాగిస్తూ కె.సి.ఆర్ కిట్టు,రైతు బీమా పథకాలు పునరుద్ధరించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.పెంచుతామన్న ఆసరా పింఛన్ల జాడ ఏదనీ ప్రశ్నించ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్లు 4000,దివ్యాంగులకు 60000,ప్రతి మహిళకు 2500ఇస్తామని రేవంత్ మోసం చేశారని మోసం చేసిన రేవంత్ రెడ్డినీ మహిళలు గల్లా పట్టి నిలదీయాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఒకవేళ ఎన్నికల ముందు ఇస్తామని ముందుకు వస్తే బకాయి పడ్డ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కామెంట్స్ రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమ పథకాలలో విఫలం.,కె.సి.ఆర్ పాలనలో సంక్షేమం రేవంత్ పాలనలో విధ్వంసం. అన్ని రంగాలను అగ్రభాగములో నిలిపిన కె.సి.ఆర్, చంద్రబాబు హయాంలో 75రూపాయల పింఛన్.ఒకరు చనిపోతే ఒకరికి పింఛన్లు. వై.ఎస్.ఆర్ హయాములో 200పింఛన్లు. తెలంగాణతోనే అభివృద్ధి సాధ్యమని కె.సి.ఆర్ నమ్మి రాష్ట్రాన్ని సాధించారు. అధికారంలోకి వచ్చిన కె.సి.ఆర్ 200నుండి 2000 పింఛన్లు చేశారు,వృద్ధులకు,దివ్యాంగులు అందరికి 44లక్షల మందికి పింఛన్లు అందించారు. దివ్యాంగులకు 4000, వంటరి మహిళలకు 2000 కె.సి.ఆర్ ఇచ్చారు. అలవికాని అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చి ప్రజలను ముంచారు. ప్రతి మహిళకు 2500 ఇస్తానని రేవంత్ మోసం చేశారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ రేవంత్ ఇచ్చి మోసం చేశారు. 2014 అక్టోబర్2నాడు సాధిముబారక్,కళ్యాణ లక్ష్మి కోసం 50116రూపాయలతో ప్రారంభించి 10116 రూపాయలకు పెంచారు. తులం బంగారం ఎగ్గొట్టడానికి కళ్యాణ లక్ష్మి, షాధిముబారక్ రద్దుకు రేవంత్ కుట్ర. ప్రజల నుండి వస్తున్న నిరసనను తట్టుకోలేక హైకోర్టులో కౌంటర్ దాఖలు ప్రభుత్వం చేయలేదు. మాట ఇచ్చి తప్పిన రేవంత్ రెడ్డినీ గల్లపట్టి నిలదీయాలి. ప్రభుత్వంను ప్రశ్నించే హక్కు మనకు ఉంది. ఏలినో పేరిట సాగు నీళ్లు అందించకుండా రైతులను మోసం చేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యతతో యాసంగి,వర్షాకాలం పంటలకు నీళ్లు సరిపోతాయి. ఆంధ్రా ప్రయోజనాలు కాపాడడం కోసం రేవంత్ మన రైతులకు ద్రోహం చేస్తున్నాడు. శ్రీశైలం ప్రాజెక్టులో చివరి నీటి బొట్టు కూడా వాడుకునే సౌకర్యం ఉన్నా రేవంత్ నిర్లక్ష్యంతో 5టి.ఏం. సి లు ఆంధ్రా దోచుకెళుతుంది. 200రోజులు మోటర్లు నడిపితే మన భూములు సస్యశ్యామలం అవుతుంది. మంత్రులు,ఎం.ఎల్. ఎలకు బి.ఆర్.ఎస్ పార్టీనీ తిట్టడం తప్పితే ప్రజల ప్రయోజనాలు పట్టవు. పోతిరెడ్డిపాడు సందర్శనను ఆంధ్రా పోలీసులు అడ్డుకున్నారు .తెలంగాణ హక్కులు కాపాడడానికి వెళితే అక్రమంగా అడ్డుకున్నారు. సగం వర్షాకాలం ముగిసిన వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం. ఆదిత్యా దాసు అనే ఆంధ్రా అధికారిని రేవంత్ తన దగ్గర పెట్టుకొని తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తున్నారు. అధికారులు ప్రజల పక్షాన పని చేయాలి. ప్రభుత్వానికి వంతపాడే అధికారుల అంతు తెలుస్తాం.ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు మాకుంది.,స్థానికి పోలీసులు నిరసనకు అనుమతి ఇవ్వకపోవడం విడ్డూరం. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారిని గుర్తు పెట్టుకుంటాం . పోలీసులు నిష్పక్షితంగా వ్యవహరించాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పడావ్ పెట్టడం సహించం పోరాడుతాం.,ప్రజలు మన హక్కుల కోసం రోడ్లు ఎక్కాలి. కాంగ్రెస్ కుట్రలపై బి.ఆర్.ఎస్ పార్టీ కదనభేరికి తరలివచ్చిన మహిళలకు నిరంజన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ,వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్, గంధం .పరంజ్యోతి ,కె.మాణిక్యం లతో పాటు, మహిళా సర్పంచులు శోభా,పద్మ,రాజమ్మ, నందిమల్ల.శారద,నాగమ్మ, షెమీం,కౌన్సిలర్స్ భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి,మురళీ సాగర్,శ్రీకర్ గౌడ్, స్వాతి హరిబాబు,శిరీష రమేష్ గౌడ్,ఏర్వ.అరుణ శ్రీనివాసులు,శంకరమ్మ బాబు నాయక్,విజయ్ కుమార్, రఘువర్ధన్ రెడ్డి, దేవర్ల.నరసింహ,మాధవ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ, ఉంగ్లం. తిరుమల్, నాగన్న యాదవ్, గులాం ఖాదర్ ఖాన్, జోహెబ్ హుస్సేన్, ఇమ్రాన్,స్టార్. రహీమ్, సమద్, ఆరీఫ్, ఫజల్, వెంకట్ సాగర్,సూర్యవంశం. గిరి, హేమంత్ ముదిరాజ్,చిట్యాల. రాము, మాజీ సర్పంచి శారద,కుమ్మరి.యాదమ్మసత్యం, బాల్ చంద్రయ్య,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 24
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 18:48:51
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
