పారిశుధ్య పరిరక్షణ లో ప్రతి దుకాణ యజమాని భాగస్వామి కావాలి.
బాన్సువాడ పట్టణం లోని దుకాణ యజమాను లు తమ దుకాణాల పరిసరాల ను ప్రతిరోజూ పరిశుభ్రం గా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ మంగళవారం ఒక ప్రకటన లో కోరారు. దుకాణాల ముందు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు వేయకుండా తగిన చెత్త బుట్టల ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తడిచెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని తెలిపారు. అలాగే దుకాణాల ముందు మురుగునీరు నిల్వ ఉండ కుండా చూసుకోవాలని, డ్రైనేజీ కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్లు తదితర వ్యర్థాల ను వేయరాదని సూచించారు. ముఖ్యంగా ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల యజమాను లు పరిశుభ్రతా ప్రమాణాల ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. పట్టణం లో పారిశుధ్యాన్ని కాపాడటం మున్సిపాలిటీ తో పాటు ప్రతి వ్యాపారి పౌరుడి బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దుకాణ యజమాను లు మున్సిపాలిటీ కి సహకరించాల ని విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


