ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు.
పరిగి(వికారాబాద్):వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని జాఫర్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన తెలంగాణ ఉద్య మానికి అందించిన సేవలను, సమాజానికి చేసిన విశిష్ట కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి స్వరూప, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Views: 67
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
