విజన్ ఇండియా @2047 జాతీయ సదస్సుకు పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి
మహబూబ్‌నగర్, :పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు7, 8 తేదీలలో "విజన్ ఇండియా @2047 – ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్" అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు తెలిపారు. సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. పాల మూరు యూనివర్సిటీ పరిపాలన భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 7న కన్హ శాంతి వనంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సుమారు 25 మంది ఉపకులపతులు, రిజిస్ట్రార్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధ కులు ఈ సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి అధ్యాప కులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తాజా ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, సుస్థిర అభివృద్ధి, యువత సాధికారత, పరిశ్రమ–విద్యాసంస్థల అనుసంధానం, నవకల్పనల ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నట్లు వివరించారు. ఆగస్టు 8న పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో టెక్నికల్ సెషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను ప్రదర్శించడంతో పాటు నిపుణులతో శాస్త్రీయ చర్చలు జరగనున్నాయని చెప్పారు. అనంతరం జరిగే ముగింపు కార్యక్రమానికి కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. వికసిత భారత్–2047 లక్ష్య సాధనలో ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్క రణలు, యువత భాగస్వామ్యం కీలకమని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ జాతీయ సదస్సు ద్వారా దేశంలోని విశ్వవిద్యాల యాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి సమకాలీన సవాళ్లు, వినూత్న పరిష్కారాలు, భవిష్యత్ కార్యాచ రణపై చర్చించనున్నారని తెలిపారు. పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు పరస్పర అనుభవాల మార్పిడి, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు లభించడంతో పాటు నూతన ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఈ సదస్సు పాలమూరు యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు, నాణ్యమైన ఉన్నత విద్యకు మరింత ఊతమివ్వనున్నదని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సదస్సు కన్వీనర్లు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ కె. ప్రవీణ్, కమిటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ నూర్జహాన్, పీఆర్వో డాక్టర్ ఎం. గాలెన్న, కోఆర్డినేటర్ డాక్టర్ శేకుంటి రవికుమార్, అధ్యాపకులు మరియు సదస్సు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Views: 113
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
