నెల్లుట్లలో తడి పొడి చెత్త పై గ్రామ సభ
లింగాల గణపురం (జనగాం) : నెల్లుట్ల గ్రామాల్లో తడి, పొడి చెత్త నిర్వహణపై గ్రామ సభలో ప్రజలకు అవగాహన కల్పించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఇంటివద్దే చెత్తను వేరుచేసే విధానాన్ని అమలు చేయాలి. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన గ్రామాగా సాధ్యమవుతాయి. గ్రామ సభ ప్రధాన ముఖ్యాంశాలు తడి చెత్త : వంటగది వ్యర్థాలు, కూరగాయల తొక్కలు, మిగిలిన ఆహారం. దీనితో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు. పొడి చెత్త : ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, సీసాలు, డబ్బాలు. దీనిని రీసైక్లింగ్ కోసం పంపాలి.వేర్వేరుగా సేకరణ: ప్రతిఇంటివారు రెండు వేర్వేరు బుట్టలను ఉపయోగించి చెత్తను పంచాయతీ సిబ్బందికి అందించాలి. గ్రామ పంచాయతీ బాధ్యత చెత్త బండిని క్రమం తప్పకుండా నిర్వహించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. తీసుకోవాల్సిన చర్యలుగ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నిరోధించడం. తడి చెత్త ద్వారా వర్మి కంపోస్ట్ (సేంద్రియ ఎరువు) తయారీని ప్రోత్సహించడం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, గ్రామస్తులలో చైతన్యం తేవడం. గ్రామాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి అలాగే పొడి చెత్తశుద్ధేదీ. తడి, పొడి చెత్త వేర్వేరుగా బకెట్లలో పెట్టి పంచాయతీల చెత్తబండిలో వేయాలని ఉదయం - ఇంటి వద్దే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామ ...తడి, పొడి చెత్త వ్యర్థాల నిర్వహణపై దృష్టి తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని గ్రామస్తులకు అవగాహన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామస్తులకు సూచించారు.. ఒక మార్పు – అభివృద్ధికి మలుపు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత కూడా. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలు, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే అలవాటు ...తడి పొడి చెత్త కళ పత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, వార్డ్ మెంబర్స్ కొయ్యడ అనిల్ గౌడ్, గొరిగే సందీప్, కత్తి శ్రీవాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, నల్ల విల్సన్, వంగ సతీష్ గౌడ్, బండారి మమత అశోక్, బత్తిని వేణు గౌడ్, కొమ్మరాజుల రేణుక కొమ్మురయ్య నాయకులు దామెర నాగరాజు, కొయ్యడ రామచంద్రం, కుర్రేముల రమేష్ గౌడ్, మాచర్ల మహేందర్, కొండ్ర ప్రవీణ్,నల్ల శ్రీనివాస్, గ్రామ కారాబర్ చెరుకు అజయ్,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
