మెగా లెదర్ పార్క్‌కు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలి
ఎంపి డాక్టర్ కడియం కావ్య
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రతిపాదించిన మెగా లెదర్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. బుధవారం లోక్‌సభలో రూల్ 377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపి, తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఉపాధి కల్పనకు దోహదపడే కీలక ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని తెలిపారు. వెంటనే పరిశీలించి ఉపాధి కల్పించే ప్రాజెక్టు ఆమోదాన్ని వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Views: 36
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
