‘చిల్లర రాజకీయాలు మానుకోవాలి’ : ఎస్సీ సెల్ చైర్మన్ నర్సింగ్
మందమర్రి, (మంచిర్యాల) : బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇక నైనా మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ సూచించారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులపై,క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక సూపర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీసెల్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైడిమల్ల నర్సింగ్ మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు,అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిపై బెదిరింపులకు పాల్పడడం ప్రజా స్వామ్యానికి విరుద్ధమని ఎస్సీ సెల్ నాయకుడు దాముక రమేష్ అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సాంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ,మాజీ ఎంపీటీసీ పుల్లూరి కల్యాణ్,ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాస్,కార్యదర్శి సాయి కృష్ణ,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
