తెలంగాణ ఉద్య‌మానికి దిక్సూచి జ‌య‌శంక‌ర్ స‌ర్‌

తెలంగాణ ఉద్య‌మానికి దిక్సూచి జ‌య‌శంక‌ర్ స‌ర్‌

  • తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన నాయ‌కుడు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి
  • బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌య‌శంక‌ర్ స‌ర్‌,
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి జ‌యంతి వేడుక‌లు
 

హన్మకొండ :  తెలంగాణ సిద్ధాంత క‌ర్త, ఉద్య‌మ దిక్సూచి ఆచార్య జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌యంతి వేడుక‌ను భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ బాల‌స‌ముద్రం నందు విద్యార్థి ఉద్య‌మ నాయ‌కుడు బైర‌పాక ప్ర‌శాంత్ ఆధ్వ‌ర్యంలో గురువారం రోజున నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మా నికి ముఖ్య అతిథులుగా కుడా మాజీ చైర్మ‌న్ మర్రి యాద‌వ రెడ్డి, మాజీ కార్పొరేట‌ర్ జోరిక ర‌మేష్‌ హాజ‌రై జ‌యశంక‌ర్ స‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్య‌మానికి జ‌య‌శంక‌ర్ స‌ర్ దిక్సూచిగా నిలిచార‌ని అన్నారు. ఉద్య‌మానికి దిశానిర్దేశం చేశార‌ని గుర్తు చేశారు. ఉద్య‌మ నాయ‌కులు కేసీఆర్ వెంట న‌డిచి మార్గ నిర్దేశం చేశార‌ని తెలిపారు. తెలంగాణ కోసం జీవితాన్ని దార‌పోసిన మ‌హ‌నీయుడు జ‌య‌శంక‌ర్ స‌ర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం కేసీఆర్ స‌ర్ జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌యంతిని, వ‌ర్ధంతిని అధికారికంగా నిర్వ‌హించార‌ని, యూనివ‌ర్సిటీకి జ‌యశంక‌ర్ స‌ర్ పేరు పెట్టార‌ని గుర్తు చేశారు. ఉద్య‌మం, తెలంగాణ ఉన్న‌న్నాళ్లు జ‌యశంక‌ర్ స‌ర్ చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని న్నారు. 
స్వ‌రాష్ట్ర ఉద్య‌మ పోరాట యోధుడు పెద్ది
మాజీ శాస‌న‌స‌భ్యులు, స్వ‌ర్గీయ పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ప్ర‌థ‌మ జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని గురువారం రోజున భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ బాల‌స‌ముద్రం నందు విద్యార్థి ఉద్య‌మ నాయ‌కుడు బైర‌పాక ప్ర‌శాంత్ ఆధ్వ‌ర్యంలో గురువారం రోజున నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మా నికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ నాయ‌కులు తాళ్ల‌పెల్లి జ‌నార్ధ‌న్ గౌడ్‌, ఉడ‌త‌ల సారంగ‌పాణి పులి ర‌జినీకాంత్  హాజ‌రయ్యారు. మొద‌ట పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.  అనంత‌రం వారు మాట్లాడుతూ... ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ పోరాట యోధుడు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అని అన్నారు. ఓరుగ‌ల్లు కేంద్రంగా ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మాన్ని న‌డిపిన నాయ‌కుడ‌ని గుర్తు చేశారు. కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రిచి, స‌బ్బండ వ‌ర్గాల‌ను ఏకం చేసి ఉద్య‌మించిన పోరాట నాయ‌కుడు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అని తెలిపారు. కార్య‌క్ర‌మంలో కుడా మాజీ చైర్మ‌న్ మర్రి యాద‌వ రెడ్డి, మాజీ కార్పొరేట‌ర్లు జోరిక ర‌మేష్‌, సంకు న‌ర్సింగ రావు, చెన్నం మ‌ధు, మేక‌ల బాబు రావు, నాయ‌కులు పోల‌పెల్లి రామ్మూర్తి, స‌ల్వాజి ర‌వీంద‌ర్ రావు, ఎస్కే మ‌హ‌మూద్‌, గండ్ర‌కోట రాకేస్ యాద‌వ్‌, గొర్రె విజ‌య్‌, విజ‌య్ రెడ్డి, స‌దాంత్‌, సురాసి మహేష్‌, సౌరం ర‌ఘు, తాళ్ల‌పెల్లి ర‌మేష్‌, చందు, పుల్ల‌య్య‌, ప్ర‌సాద్‌, ప‌బ్బోజు శ్రీ‌కాంత చారి, బ‌రిగెల విన‌య్‌, మూటిక రాజు యాద‌వ్‌, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి వినీల్ రావు, ఇస్మాయిల్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు