నకిలీ నెంబర్ ప్లేట్లపై కఠిన చర్యలు - పోచయ్య

నకిలీ నెంబర్ ప్లేట్లపై కఠిన చర్యలు - పోచయ్య

రేగోడ్ (మెదక్ ) : మెదక్ జిల్లా ఎస్పీ డి.శ్రీనివాసరావు సూచనల మేరకు రేగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాటిపల్లి గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు.ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్.ఎస్ .ఆర్.పి) మాత్రమే చట్టబద్ధమైనవని, నకిలీ, మార్పులు చేసిన,స్టిక్కర్ ఆధారిత, డూప్లికేట్ లేదా అస్పష్టంగా కనిపించే నంబర్ ప్లేట్లను వాహనాలపై అమర్చడం చట్టవిరుద్ధమని రేగోడు ఎస్సై పోచయ్య తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించడం ద్వారా వాహనాల అసలు గుర్తింపును దాచడం,ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం,నేర కార్యకలాపాలకు సహకరించే అవకాశం ఉన్నందున ఇటువంటి ఉల్లంఘనలను పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.నకిలీ లేదా అనధికారిక నెంబర్ ప్లేట్లతో సంచరించే వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు,అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకుని అమల్లో ఉన్న చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసుతోపాటు జైలు శిక్ష తప్పదని మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన రిజిస్టర్ ఓనర్ పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.అన్ని వాహన యజమానులు తమ వాహనాలకు ప్రభుత్వం ఆమోదిం చిన హెచ్.ఎస్.ఆర్.పి నంబర్ ప్లేట్లు మాత్రమే అమర్చుకున్నట్లు వెంటనే ధృవీకరించుకోవాలని సూచించారు.చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నిబంధనలను పాటిస్తూ,ట్రాఫిక్ నియమాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని అన్నారు.
 
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు