ఐదేళ్లు అధికారంలో ఉండి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదు.
ఇప్పుడు కపట ప్రేమ ఎందుకు?
పుల్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గారెడ్డి
చౌటకూర్ :సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో మాజీ ఎమ్మెల్యే వ్యవహారంపై మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా కాలయాపన చేసి, ఇప్పుడు లబ్ధిదారుల పేరుతో రాజకీయాలు చేయడం సమంజసం కాదని అన్నారు .గ్రామస్థులు మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి సమస్యను తీసుకెళ్లగానే అధికారులు డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టారని తెలిపారు. ఇళ్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించిన తర్వాతే పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారని చెప్పారు. అయితే, మరమ్మతు పనులకు ఆటంకం కలిగించేలా కొందరు టీఆర్ఎస్ నాయకులు తమ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇళ్లలోకి వెళ్లాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీంతో పనులు ఆలస్యం కావడంతో పాటు నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని అన్నారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల పేర్లతో జాబితాలు సిద్ధం చేసి, అర్హులైన పేదలను పక్కన పెట్టారని దుర్గారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి, పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించకుండా, మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలని దుర్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు త్వరగా ఇళ్లు కేటాయించే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Views: 61
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
