రోడ్లు మట్టి.. గుంతల మయం
- రూ.2 లక్షలతో పూడ్చిన గుంతలు తొలి వర్షానికే మళ్లీ యథాతథం
- ప్రజాధనం వృథానా?..
- మార్కెట్–కోర్టు వరకు రోడ్డుపై నిత్యం నరకయాతన
బెల్లంపల్లి, (మంచిర్యాల) : బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ నుంచి కోర్టు వరకు ఉన్న ప్రధాన రహదారి ఇరువైపులా అధ్వాన్నంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా మట్టి కుప్పలు, గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు పగలు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. ఈ రహదారిపై ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు, కోర్టు సిబ్బంది, ప్రజలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ రహదారి నిర్వహణపై సంబంధిత శాఖలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని తొలగించకపోవడంతో గుంతలు పూర్తిగా కప్పుకుపోయి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఇదే రహదారిలో గుంతల పూడ్చివేత కోసం మున్సిపాలిటీ రూ.2 లక్షలు మంజూరు చేసి మరమ్మతు పనులు చేపట్టింది. అయితే పైపైనే గుంతలు పూడ్చడంతో తొలి వర్షానికే రోడ్డు మళ్లీ పాత స్థితికి చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, ప్రజాధనం వినియోగంపై పూర్తి వివరాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించి, గుంతలను నాణ్యంగా పూడ్చి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యం కొనసాగితే ఎప్పుడైనా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని నాయకులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Views: 54
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
