ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: చల్లా ధర్మారెడ్డి
హన్మకొండ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆచార్య జయశంకర్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని అన్నారు.ఆ మహనీయుడు మన పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించడం మన అదృష్టం. తెలంగాణ సమాజానికి ఆయన చూపిన దిశానిర్దేశం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆచార్య జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
