సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

హుస్నాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఘటనపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు.ఈ విషాద ఘటనలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

Views: 45

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ...
పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేసిన పూర్వ విద్యార్థి
ఎంక్వయిరీ లేకుండానే మెమోలు...
గురువారం గ్రామ, వార్డు సభలు
హైవేపై మృత్యుఘోష..
దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం
మురుగు నీటితో దోమల బెడద.. పట్టించుకోని అధికారులు