దేశవ్యాప్త జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి

బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

దేశవ్యాప్త జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి

అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన

కరీంనగర్ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగు తున్న జనగణనలో ఓబీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారుజిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అన్నింటికీ లెక్కలు ఉన్నాయని, కానీ బీసీల లెక్కలు మాత్రం తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు పూర్తి గణాంకాల ద్వారానే సాధ్యమ వుతాయని, అందుకే దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ జనగణనలో బీసీ కులగణన అంశాన్ని చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి బీసీల న్యాయమైన డిమాండ్ ను నెరవేర్చా లని విజ్ఞప్తి చేశారు. టిఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు మాదాసు సంజీవ్, బీసీ కుల సంఘాల అధ్యక్షుడు జీఎస్ ఆనంద్, బీసీ సంఘం కార్యదర్శులు దుంపటపెల్లి మురళి, వాయిల రాజ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు గాజే ప్రజ్యోత్, కుసుంబా ఆదర్శ్, సంజీవ్, విష్ణుచారి తదితరులు పాల్గొన్నారు. 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News