ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు

ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు

  • తెలంగాణ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
  • కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్. వెంకటరమణ

కొత్తగూడెం : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త, ఆర్థికవేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్మేనేజర్ సీహెచ్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం వెంకటరమణ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమాజాభివృద్ధి, ప్రజాసేవ, కర్తవ్య నిర్వహణలో జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన భావితరాలకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా సమాజంపై చెరగని ముద్ర వేసిన మహనీయుడని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన అందించిన మేధోసహకారం, దూరదృష్టి, నిరంతర కృషి భావితరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన బోధించిన విలువలు, నైతికత, సామాజిక బాధ్యతలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఒ టు జీఎం గోవిందరావు, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఏఐటీయూసీ ప్రతినిధి సందేబోయిన శ్రీనివాస్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, ఏజీఎం (సివిల్) సీహెచ్. రామకృష్ణ, ఏజీఎం (ఫైనాన్స్) బిబత్స, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, డీవైపీఎం హరీష్, సీనియర్ పీఓ మురళి, ఐఎన్‌టీయూసీ ఫిట్ సెక్రటరీ సీహెచ్. సాగర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ కే. సౌజన్యతో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. 
Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు