బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం

బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం

టేకులపల్లి. టేకులపల్లి మండలం వి.బి.జి.ఆర్.ఎం.జి. పథకంలో భాగంగా బోడు, లచ్చగూడెం గ్రామపంచాయతీల్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు  పొదేం స్వరూప,  ఎదుల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.బోడు గ్రామంలోని గుట్ట చెరువు వద్ద ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. లచ్చగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సుమారు 200 పూలు, పండ్ల మొక్కలను నాటించారు. కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాలయం అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎన్. రవికుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కొండపల్లి శ్రీదేవి హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవోలు, ఈసీలు, పీఎస్‌లు, టీఏలు, ఎఫ్‌ఏలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ, ఎస్‌ఐలు, అటవీ శాఖ ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు, పోలీస్ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు