ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS

ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS

మహబూబ్‌నగర్ అర్బన్ :తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (TMRPS) వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు సిరిసనోళ్ల బాలరాజు మాదిగ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని నాయకులు కోరారు.ఈ సందర్భంగా TMRPS నాయకులు ప్రధానంగా అంబేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని, ఎస్సీల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు హామీ ఇచ్చిన సామాజిక భద్రత పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే విద్యా హక్కు చట్టం–2009 (RTE Act)ను తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేసి, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కూడా రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాదిగ దండోరా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలని, పారిశ్రామిక కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగుల హక్కులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎస్సీలకు కేటాయించిన లావణి (అసైన్డ్) భూములను పూర్తి పట్టా భూములుగా మార్చాలని, చెప్పులు కుట్టే మరియు డప్పు కొట్టే కళాకారులకు నెలకు రూ.5,000 పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో TMRPS రాష్ట్ర అధ్యక్షులు సిరిసనోళ్ల బాలరాజు మాదిగ, రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు బోయపల్లి నర్సింహులు మాదిగ, కొత్త నర్సింహులు మాదిగ, జోడు ఆంజనేయులు మాదిగ, కె. యాదగిరి, చందర్, బి.హెచ్. రమేష్ మాదిగ, హజార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా సంక్షేమ డిమాండ్లపై అత్యవసరంగా స్పందించి, తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని TMRPS నాయకులు విజ్ఞప్తి చేశారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు