భక్తజనసంద్రంగా మారిన శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరాలయం
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని అతి పురాతన శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పవిత్ర శ్రావణ సోమవారాన్ని పురస్క రించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఈ సందర్భంగా చౌటకూర్ గ్రామానికి చెందిన కాశిరెడ్డి–లావణ్య దంపతులు, కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన ఓం ప్రకాశ్–వసుంధర దంపతులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏకాదశ రుద్రాభిషేకం, లింగాభిషేకాలు జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు అభిలాష్ తివారీ మాట్లాడుతూ.. శ్రావణ మాసం పురస్కరించు కుని ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 18:24:03
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్
