ఆ వైపు వెళ్లాలంటే భయపడుతున్న ద్విచక్ర వాహనదారులు.

 ఆ వైపు వెళ్లాలంటే భయపడుతున్న ద్విచక్ర వాహనదారులు.

  • బాన్సువాడ లో ఆ చౌరస్తా అంటే భయం.
  • ద్విచక్ర వాహనాని కి చాలాన్ల మోత.
  • ఆటోమెటిక్ సిగ్నల్ లను మున్సిపల్ పొలిమేరలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్న వాహన దారులు..
 

బాన్సువాడ మున్సిపాలిటీ లోని తాడుకోల్ చౌరస్తా మార్గం గుండా ద్విచక్ర  వాహనదారు లు ప్రయాణం చేయాలంటే ఆందోళనకు గురవుతున్నారు. ఆ మార్గాల గుండా వెళ్తే స్థానిక పోలీసులు ఏర్పాటు చేసి న ఆటోమేటిక్ కెమెరాలు హెల్మెట్ లేదని, సిగ్నల్ జంప్ అయ్యారని, ఆటోమేటిక్గా వాహనదారుని ఫోనుకు మెసేజ్లు మోత మోగడమే కారణం. మున్సిపల్ పరిధి లో అన్ని ద్విచక్ర వాహనదారులకు పదుల సంఖ్య లో చాలాన్లు నమోదు కావడం తో వాహనదారు లు ఆందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో అంబేద్కర్ చౌరస్తా, తాడుకోలు చౌరస్తాలో జిల్లా ఉన్నంత స్థాయి పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాల ద్వారా వందలాది చాలన్లు నమోదు కావడం జరుగు తుందని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ద్విచక్ర వాహనదారుడు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా వాటిని అతిక్రమిస్తే  చాలాన్లు  వేయడం లో  ఎలాంటి తప్పు లేదని వారు అంటున్నారు. కానీ ప్రతిరోజు దినచర్య లో భాగంగా ఇంటి అవసరాలు, ఉద్యోగ పనుల నిమిత్తం తిరగడం జరుగుతుంది. హెల్మెట్ లేదని సాకు తో జరిమానాలు వేయడం సమంజసంగా లేదని వాహనదారులు ఉన్నత పోలీస్ అధికారుల కు సూచిస్తున్నారు. ఈ సందర్భం గా పలువురు వాహనదారులు అధికార పార్టీ నాయకులకు తెల్పడంతో వారు స్పందించి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా ఇంకా పోలీసు అధికారులు స్పందించక పోవడం ద్విచక్ర వాహనదారుల శాపంగా మారింది. మున్సిపల్ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సిగ్నల ను మున్సిపల్ చివర్లో కొయ్య గుట్ట, బీర్కూర్ చౌరస్తా ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనదారుల జేబుల కు చిల్లులు పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల పై ఎంతైనా ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. బాన్సువాడ మున్సిపాలిటీ ప్రాంతం కావడం తో బడుగు బలహీన వర్గాల చెందిన నిరుపేదలే అధికంగా ఉండడం వారు ప్రతిరోజు కష్టపడి తే గాని కడుపు నిండే పరిస్థితి లేక పోవడం జరుగుతుంది, వారికి ప్రతి రోజు కూలి పని చేసుకోవడమే దిని చర్యగా ఉంటుంది, అలాంటి సామాన్యుల కు చాలాన్లు భారంగా మారాయి. పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా హెల్మెట్ లేక 235 రూపాయలు జరిమానా పడుతుంది. ప్రతి రోజు ఒక ద్విచక్ర వాహనదారునికి మూడు నుండి ఐదు ఆరు చాలన్లు పడడం తో 700 నుండి 1400 భారం పడు తుంది అని వాహనదారులు జంకుతున్నారు. ప్రతి దినము మున్సిపల్ పరిధిలో వందలాది చాలాన్లు నమోదు కావడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు స్థానికులు వెళ్లేవారికి ఈ ప్రమాదం ముప్పుగా ఉంటుంది. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ నడిబొడ్డు లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సిగ్నల్ లను మున్సిపల్ పొలిమేర లో ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనదారు ల జేబుల కు చిల్లులు పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల పై  ఉందని వారు కోరుతున్నారు. kmar
Views: 87

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రహదారి నిబంధనలు రహదారి నిబంధనలు
మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : కట్లకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనుమల్ల వైకుంఠం ఆధ్వర్యంలో రహదారి నిబంధనలు, భద్రతపై విద్యార్థులకు...
దేశవ్యాప్త జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి
జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో ఎంజేపీ దౌల్తాబాద్‌ సత్తా
చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు
 ఆ వైపు వెళ్లాలంటే భయపడుతున్న ద్విచక్ర వాహనదారులు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా తోట లక్ష్మీకాంతారావు బాధ్యతల స్వీకరణ