భరతనాట్యంలో ధన్విశ్రీ, శ్రీక్షిత ప్రతిభ
‘శ్రీ చక్రి పద్మ’ పురస్కారం
బెల్లంపల్లి / మంచిర్యాల : భరతనాట్యంలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన చిన్నారులు బింగి ధన్విశ్రీ, బింగి శ్రీక్షితలు విశేష ప్రతిభ కనబరిచి ‘శ్రీ చక్రి పద్మ’పురస్కారాన్ని అందుకున్నారు. భువనగిరి జిల్లా శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతనాట్య కార్యక్రమంలో వారు పాల్గొని తమ నృత్య ప్రతిభను ప్రదర్శించారు. బింగి నరేష్–సుస్మిత దంపతుల కుమార్తెలైన ధన్విశ్రీ, శ్రీక్షితలు గతంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలోనూ భరతనాట్య ప్రదర్శనతో విశేష ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ‘శ్రీ చక్రి పద్మ’ పురస్కారం అందుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారుల ప్రతిభను పలువురు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Views: 17
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 15:10:36
బాన్సువాడ లో ఆ చౌరస్తా అంటే భయం.
ద్విచక్ర వాహనాని కి చాలాన్ల మోత.
ఆటోమెటిక్ సిగ్నల్ లను మున్సిపల్ పొలిమేరలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్న వాహన...
