మానవత్వానికి మారుపేరు బుషిగంపల ఆంజనేయులు
లింగాల గణపురం (జనగాం) : ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా.. అండగా ఉంటానని హామీకష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, మానవత్వాన్ని చాటుకుంటున్న జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కళ్లెం గ్రామానికి చెందిన మబ్బు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసు కున్న ఆంజనేయులు మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.5,000 (అక్షరాల ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తన వంతు సహకారం అందిస్తూ అన్నివేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల గ్రామస్థులు ఆంజనేయులును అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కళ్లెం టెంపుల్ చైర్మన్, గ్రామ BLAలు, గ్రామ యూత్ ప్రెసిడెంట్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తూ.. మానవత్వమే తన మార్గమని చాటుతున్న బుషిగంపల ఆంజనేయులు సేవాభావాన్ని గ్రామస్థులు కొనియాడారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


