సర్వాయిపేట పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి
అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు*
మల్యాల : హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్వాయిపేటలో “పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా నూతనంగా అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులను మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. టూరిజం ప్రాజెక్ట్‌లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను మంత్రి పరిశీలించి, విగ్రహ ఏర్పాటు, పరిసరాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆ హామీకి అనుగుణంగా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సర్వాయిపేట పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రారంభించేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ప్రాజెక్ట్‌లో నిర్మిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మ్యూజియం పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. మ్యూజియం భవనం ముందు ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా ఈ టూరిజం ప్రాజెక్ట్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Aug 2026 18:24:47
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
