మానాల గ్రామంలో వివో భవన నిర్మాణం పరిశీలన
మల్యాల, : జగిత్యాల జిల్లా పరిధిలోని పెగడపల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాలకు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పురోగతిని పరిశీలించిన కలెక్టర్, పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన యంత్రాల కొనుగోలు, నిర్వహణ విధానాలపై అధికారులతో సమీక్షించారు. మార్గదర్శకాల ప్రకారం ఈ యూనిట్‌లో బేలింగ్ మెషిన్, ష్రెడర్ మెషిన్, లిఫ్టింగ్ కార్ట్, వెయింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలను సమకూరుస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యం: ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ... మూడు మండలాలకు ఉమ్మడిగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపారు. దీని ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించి పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. వివో భవనాన్ని త్వరగా అందుబాటులోకి తేవాలి: అనంతరం మల్యాల మండలం మానాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న మహిళా సమాఖ్య (వివో) భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణం దాదాపు పూర్తయినందున, మిగిలిన పనులను వేగవంతం చేసి త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తద్వారా మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ లక్ష్మణ్ రావు, ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ జయ ప్రసాద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
