హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు.
తాండూరు (వికారాబాద్ ) హింసాత్మక రాజకీయ కుట్రలు చేయడం సరి కాదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం తాండూర్ పట్టణంలోని ఇందిరమ్మ రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు నిర్వహించిన వేడుకలో చోటుచేసుకున్న ఘటనలు విచారకరమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తమ ఆరోపణల ప్రకారం బీఆర్ఎస్‌కు చెందిన కౌన్సిలర్జావీద్ అనుచరులు వేడుకల వద్దకు వచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని పేర్కొన్నారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమాలను రాజకీయ కుట్రలకు వేదికగా మార్చే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ నాయకుల దాడిలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మెహీజ్ ను చైర్ ర్సన్ నీరజ బాల్రెడ్డి పమర్శించి వారికి అండగా ఉంటామని దైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి టౌన్ అధ్యక్షులు పలు ప్రశ్నలు సంధించారు. కాలనీలో ప్రశాంతంగా జరుగుతున్న జన్మదిన వేడుకల వద్దకు వచ్చి గొడవకు కారణమైన వారు ఎవరని.. జన్మదిన వేడుకల సందర్భంగా సెల్ఫీ వీడియోలు చిత్రీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారనే తమ ఆరోపణల నేపథ్యంలో, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఉద్రిక్తతలకు కారణం కాలేదా? అన్నారు. వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన వారు ఎవరు అని ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణాన్ని భంగం చేసి ఉద్రిక్తతలు సృష్టించాల్సిన అవసరం ఏమిటి అని అన్నారు. -దౌర్జన్య రాజకీయాలకు ఉసిగొల్పడం వెనుక ఉద్దేశం ఏమిటి అని అన్నారు. ఎమ్మెల్యే వారంలో నాలుగు రోజులు తాండూర్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటారని, అభివృద్ధి అంశాలపై ప్రశ్నించాలనుకుంటే అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని జన్మదిన వేడుకల సమయంలోనే ఆ అంశాలు ఎందుకు గుర్తుకు వచ్చాయి కాలనీ ప్రజలు ఎమ్మెల్యే గారిపై తమ అభిమానాన్ని చాటుకోవడం మీకు ఎందుకు అభ్యంతరంగా మారిందని.. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నమన్నారు. ప్రజల మధ్య శాంతిభద్రతలకు భంగం కలిగించే రాజకీయాలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా.. అన్నారు. రాజకీయాలు చేయడానికి ప్రతి సందర్భాన్ని వేదికగా మార్చడం సరికాదని, ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలు, జన్మదిన వేడుకలను వివాదాస్పదం చేయడం ప్రజలు సమర్థించరని నాగరాజు అన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ హింస, రెచ్చగొట్టే చర్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ సమర్థించరని ఆయన అన్నారు.
Views: 37
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
