రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ బిజినపల్లి: బిజినపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు బిజినపల్లి మండలానికి సంబంధించిన రైతులకు స్ప్రింక్లర్ పైపులను నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. స్ప్రింక్లర్ విధానం వల్ల నీటి వృథాను అరికట్టడంతో పాటు పంట దిగుబడి పెరుగుతుందన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, రైతుబంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Views: 56
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
