బీచుపల్లి ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్న మాజీ ఎం.పి రావుల
వనపర్తి :బిచుపల్లి ఆంజనేయస్వామినీ మాజీ ఎం.పి రావుల దర్శించుకున్నారు.శ్రావణ మాసం సందర్భంగా గౌరవ మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి గారు తన ఇష్టదైవం బీచుపల్లి ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డినీ అధికారులు,అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి శేషావస్త్రం బహుకరించి సన్మానించారు. రావుల చంద్రశేఖరరెడ్డి గారు మాట్లాడుతూ అత్యంత మహిమాన్విత క్షేత్రం బీచుపల్లి పుణ్యక్షేత్రం అని ఆంజనేయస్వామి తన ఇష్టదైవం అని ప్రజలు సుభిక్షంగా, సౌభాగ్యంగా ఆయురారోగ్యాలతో అష్టాయిశ్వర్యలతో సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామి వారిని ప్రార్థించానని అన్నారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ జెడ్.పి.టి.సి.కర్రీస్వామి,ఎం.రాజశేఖర్,సాయిప్రసాద్,గోపిబాబు,డాక్టర్.ఆనంద్, అలిపీర్,సీతారా. వెంకటేశ్వర్లు,వడ్డే.రమేష్,టి. ఎన్.ఎల్లారెడ్డి,సందీప్,మాజీ సర్పంచ్ యాదయ్య,కొత్తకోట.బాలయ్య,లక్ష్మణ్ గౌడ్,శివప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
