కళ్లెం పాఠశాలకు స్మార్ట్ ఎల్ఈడీ టీవీ బహూకరణ
లింగాల గణపురం (జనగాం ): కళ్లెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా రూ.12 వేల విలువైన స్మార్ట్ ఎల్ఈడీ టీవీని జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు డిజిటల్ విద్యను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా టీవీని అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కళ్లెం టెంపుల్ చైర్మన్, గ్రామ బీఎల్ఏలు, గ్రామ యువజన అధ్యక్షుడు, గ్రామశాఖ అధ్యక్షులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


