అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడాలి...
- గ్రామాలలో,బస్తీలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల నిర్మాణ ప్రక్రియను చేపట్టాలి.
- ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ యాదగిరి మాదిగ.
బోధన్, నిజామాబాద్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసి ఎస్సి వర్గీకరణను సాధించడమే కాకుండా మాదిగలతో పాటు పేద వర్గాల సంక్షేమం కోసం ఉద్యమాలు నడిపి పలు అనేక సంక్షేమ పథకాలు సాధించి, ఎమ్మార్పీఎస్ ఉద్యమం మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడుతుందని, ప్రజా సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలను నిర్మిస్తుందని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల జిల్లా ఇన్చార్జ్ ముసాయిపేట యాదగిరి మాదిగ పేర్కొన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో లసింగారి భూమయ్య మాదిగ అధ్యక్షతన బోధన్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధి గా నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మసాయి పేట యాదగిరి మాదిగ విచ్చేసి మాట్లాడుతూ... ఈదేశంలో దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉండడం వలన వివక్షతకు గురై పేదరికంలోనే మిగిలిపోయామని, అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదలకు పేదరికాన్ని నిర్ములించేందుకు ఉద్యమించాలని అన్నారు. రాజకీయ చైతన్యాన్ని సృహను విడువకుండా బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలన్నారు. బోధన్ నియోజకవర్గంలోని 5 మండలాలకు ఎమ్మార్పీఎస్ ఇన్చార్జిలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆకారం రమేష్ మాదిగ, మాదిగ మహిళా సంఘం జిల్లా సీనియర్ నాయకురాలు గొమ్ముట్టు పద్మ మాదిగ, పిల్లల కోయిల సావిత్రి మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గంధమాల చంద్రయ్య మాదిగ, తాడెం అబ్బాయ్య మాదిగ, బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
