మల్లికార్జున్ ఖర్గే కి ఫిర్యాదు చేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి :వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో ఖర్గే గారి నివాసంలో ఆయనను కలిసి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు.కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఫార్మ్లను డబ్బులకు అమ్ముకున్నదంటూ, ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పై చర్యలు తీసుకోవాలనీ కోరారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించిన ఆయన పూర్తిస్థాయిలో విచారించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్టు ఎమ్మెల్యే గారు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
