దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం

 మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం

దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం

ముత్తారం, : ముత్తారం మండలంలోని దర్యాపూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాపెల్లి రాజయ్య,ఉపసర్పంచ్ కలవేన సమ్మక్క శేరాలు, వార్డు సభ్యులు మంద మంజుల మహేందర్,దొడ్ల కమల కిషన్,గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.అలాగే గ్రామస్తులు సల్ల సతీష్, గట్టయ్య, రాజయ్య, మహేందర్, పంచాయతీ సిబ్బంది ఓదేలు, చంద్రకళ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు తెలిపారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ...
పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేసిన పూర్వ విద్యార్థి
ఎంక్వయిరీ లేకుండానే మెమోలు...
గురువారం గ్రామ, వార్డు సభలు
హైవేపై మృత్యుఘోష..
దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం
మురుగు నీటితో దోమల బెడద.. పట్టించుకోని అధికారులు