మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎంపీ రావుల
వనపర్తి : కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతాంగ సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి,వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన రైతు సంఘం అగ్ర నేత సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.రైతన్నలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తన సంతాప సందేశంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల హక్కులు,సంక్షేమం, అభ్యున్నతి కోసం మల్లారెడ్డి తన జీవిత పర్యంతం పోరాడారన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ రావుల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితు లు ఉద్యోగాలు, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు. 98 జీఓను వెంటనే అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ రామస్వామి పాల్గొని నిర్వాసితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పలువురు శ్రీశైలం నిర్వాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 15:10:36
బాన్సువాడ లో ఆ చౌరస్తా అంటే భయం.
ద్విచక్ర వాహనాని కి చాలాన్ల మోత.
ఆటోమెటిక్ సిగ్నల్ లను మున్సిపల్ పొలిమేరలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్న వాహన...
