నిరుపేదలకు కొండంత అండగా ఈఎల్వి ఫౌండేషన్

నిరుపేదలకు కొండంత అండగా ఈఎల్వి ఫౌండేషన్

నల్గొండ/మర్రిగూడ:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలోనూ పేదరికం,అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలకు ఈఎల్వి ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ఫౌండేషన్ మర్రిగూడ మండల కోఆర్డినేటర్ ఐతగోని నరసింహ గౌడ్ స్పష్టం చేశారు.శనివారం రోజున స్థానిక భారత్ గార్డెన్స్‌ లో ఈఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే మర్రిగూడ విలేకరుల రక్షణను దృష్టిలో ఉంచుకుని వారికి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహ గౌడ్ మాట్లాడుతూ పక్షవాతంతో బాధపడుతున్న నిరుపేద రోగులను గుర్తించి, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఫౌండేషన్ బాధ్యత తీసుకుం టుంది. ఇందులో భాగంగా ప్రతి 15 రోజులకోసారి రోగులను కర్ణాటకలోని నిపుణులైన వైద్యుల వద్దకు తీసుకెళ్లి ఉచితంగా ట్రీట్మెంట్ చేయిస్తామని హామీ ఇచ్చారు.మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి ఈఎల్వి సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని,పేదరికంతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు,అత్యవసర వైద్య సాయం కావలసిన బాధితులకు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన తెలిపారు సమాచారం అందిస్తే వాలిపోతాం ఆపదలో ఉన్నవారి సమాచారం లభిస్తే చాలు.. మా ఈఎల్వి ఫౌండేషన్ బృందం స్వయంగా వారి వద్దకే చేరుకుని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంది. ప్రజలు ఈ సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి" అని ఆయన కోరారు. సమాజంలో ప్రతి పేదవాడికి, నిరాశ్రయులకు సేవ చేయడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని నరసింహ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు.
Views: 210

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
నూతన తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,