22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,
తప్పిదాల పై సమగ్ర విచారణ జరిపించాలి
మంచిర్యాల:రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22A నిషేధిత భూముల జాబితా లో జరిగిన అక్రమాలు, తప్పిదాల పై సమగ్ర విచారణ జరిపించాలని అదే విధంగా 22 GO లో తప్పిదం జరిగిందని ఒప్పుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ గారికి మెమోరాండం అందించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం సమంజసం కాదని రఘునాథ్ అన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటుకు కట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
Views: 17
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
