తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్‌లో రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోల్ల కొమురెల్లి, అందె స్వామి, బొడ్డు రాములు, గాండ్ల నర్సయ్య వ్యవహరించారు. ఎన్నికల అధికారులుగా రాష్ట్ర సలహాదారులు అబ్బిడి రామిరెడ్డి, కూకట్ల తిరుపతి బాధ్యతలు నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా పొన్నం పరశురాములు, అధ్యక్షులుగా అటికం రాజేశంగౌడ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అట్ల కొమురయ్య, రావుల సదానందం, కొలిపాక సత్తిబాబు, చిప్పకుర్తి అరవిందస్వామి, మ్యాదరవేని చొక్కయ్య, ప్రధాన కార్యదర్శిగా పిడుకు శ్రీనివాస్, కార్యదర్శులుగా గోస్కుల ప్రవీణ్, పల్లికొండ సాగరిక, బొంగోని శంకర్‌గౌడ్, తీగల కొమురయ్య, కోశాధికారిగా సెంచాల రాజేశం ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కందుల సదయ్య, బరిగెల సతీశ్, మెండె సుధాకర్, బోయిని కొమురయ్య, కత్తెర్ల రాజయ్య, పూదరి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు అటికం రాజేశంగౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదికను జిల్లాలో మరింత బలోపేతం చేసి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Views: 32
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
