విద్యార్థుల సమస్య పై వెంటనే స్పందించి న పోచారం.
బస్సులో విద్యార్థుల తో ప్రయాణించిన ఎమ్మెల్యే పోచారం.....
కామారెడ్డి జిల్లా బాన్సువాడ : విద్యార్థుల సమస్య పై శుక్రవారం వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. బస్సు లో విద్యార్థుల తో ప్రయాణించి న పోచారం కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బిర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా పరిసర గ్రామాల నుంచి ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల కు వెళ్లే విద్యార్థుల ఇబ్బందుల ను దృష్టి లో ఉంచుకు ని ప్రత్యేక బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ నెల 7 న బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాని కి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న సమయం లో మార్గమధ్యం లో కిష్టాపూర్, బీర్కూర్ పరిసర గ్రామాల కు చెందిన ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల విద్యార్థు లు తమ సమస్య ను పోచారం దృష్టికి తీసుకువచ్చారు. సమయాని కి కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలియ జేయడం తో, పోచారం వెంటనే స్పందించి బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ తో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోచారం సూచనల మేరకు బాన్సువాడ నుంచి కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, కిష్టాపూర్, బిర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా మీదు గా ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీస్ ను బాన్సువాడ బస్టాండు లో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించి, విద్యార్థుల తో కలిసి స్వయం గా బస్సు లో ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల వరకు ప్రయా ణించారు. విద్యార్థుల కు మరింత సౌకర్యవంతం గా ఉండేలా ఈ ప్రత్యేక బస్సు సర్వీస్ ను ఉదయం సాయంత్రం రెండు వేళల్లో నడిపించాలని బాన్సువాడ డిపో మేనేజర్ కు పోచారం సూచించారు. తమ సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి, ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయించిన పోచారం శ్రీనివాసరెడ్డి కి విద్యార్థిను లు హృదయపూర్వక ధన్యవాదా లు తెలిపారు. ఈ కార్యక్రమం లో బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్, ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఈ. గంగాధర్, బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్, మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
.jpg)
Views: 36
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
