ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ

ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కేంద్రంలో ఆర్డీవోతో ఆదేశాల మేరకు సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారులకు బీఎల్‌వోలు,ఎస్‌ఐఆర్‌  నోటీసులను పంపిణీ చేశారు. ఈ నోటీసులను ఓటర్లకు సక్రమంగా అందజేయడంతో పాటు, వాటి వివరాలను యాప్‌లో ఎలా నమోదు చేయాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.పుల్కల్‌ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆర్డీవోతో పాటు ఆందోల్‌-జోగిపేట, పుల్కల్‌ తహసీల్దార్లు, ఎంపీవో, డీటీ, జీపీవో, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని, సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సూచించారు.శిక్షణ అనంతరం ఆర్డీవో పుల్కల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను, రోజువారీ పనితీరును పరిశీలించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
 
Views: 38

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
నూతన తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,