పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
బిచ్కుంద : శ్రావణమాసం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ జగద్గురు స్వామి నరేంద్రచార్య జీ పాదయాత్ర భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. బిచ్కుంద నుంచి జుక్కల్ మండలంలోని దోసపల్లి శ్రీ నరేంద్ర స్వామి పీఠం వరకు భక్తులు పాదయాత్రగా తరలివెళ్తున్నారు.ఈ పాదయాత్రలో పాల్గొనే భక్తులకు పత్లాపూర్ గ్రామానికి చెందిన BRS నాయకులు వరుసగా రెండేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాదయాత్ర మార్గంలో భక్తులకు చాయ్, బిస్కెట్లు, తాగునీరు అందిస్తూ తమవంతు సేవ చేస్తున్నారు.భక్తి మార్గంలో పాదయాత్ర చేస్తున్న భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని నాయకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సేవా కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అరుణ్, సొసైటీ వైస్ చైర్మన్ యాదరావ్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ శివకాంత్ అప్ప, రాజు, నారం సుదర్శన్, ఎడిగి బాలరాజ్, బంటు విఠల్, కప్ప వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


