స్వచ్ఛమైన గానుగ నూనె ఆరోగ్యానికి మేలు: కలెక్టర్ రాజర్షిషా

స్వచ్ఛమైన గానుగ నూనె ఆరోగ్యానికి మేలు: కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్ జిల్లా : రసాయనాలు లేకుండా పురాతన పద్ధతిలో ఎద్దుల గానుగ ద్వారా తీసే స్వచ్ఛమైన నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో తోట రాణి - శ్రీధర్ దంపతులు ఏర్పాటు చేసిన 'నిధి నేచురల్ ఫార్మింగ్' ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోనే తొలిసారిగా సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నూనె ఉత్పత్తిని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రజారోగ్యానికి దోహదపడే ఇలాంటి సహజసిద్ధ యూనిట్లకు ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, సబ్సిడీతో కూడిన రుణాలు సైతం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, తహసిల్దార్ రాజ్ మోహన్, ఎంపిడిఓ శంకర్, ఇతర అధికారులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-11 at 3.57.55 PM

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల పురోగతిపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో...
పంచాయతీలకు నిధుల బదలాయింపుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం
పార్లమెంటు పనితీరును ప్రతిబింబించేలా మాక్ పార్లమెంట్  
అటవీ శాఖ అమరవీరుల స్మారకార్థం ర్యాలీ 
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR–2026 పురోగతిని పరిశీలించిన CEO సుధర్శన్ రెడ్డి 
నీట్ విజేత ‘ఇందు’కు కొండంత అండ గా సూర్యాపేట ఎస్పి 
మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశం