ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?
786 దరఖాస్తులపై పరిశీలన
- చేయూత పెన్షన్లపై సర్కార్ ఫోకస్.. గ్రామాల వారీగా వెరిఫికేషన్
- ఆరుగురు అధికారులతో గ్రామాల వారీగా వెరిఫికేషన్: ఎంపీడీవో శాంతమ్మ
మర్పల్లి,(వికారాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ ఇచ్చేందుకు దరఖాస్తులకు కోరగా మండలంలో చేయూత పెన్షన్ల కోసం మొత్తం 786 దరఖాస్తులు అందాయని ఎంపీడీవో శాంతమ్మ తెలిపారు. దరఖాస్తుల పరిశీలనకు ఆరుగురు అధికారులతో ప్రత్యేక వెరిఫికేషన్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో అధికారికి ఐదు గ్రామాల చొప్పున బాధ్యతలు అప్పగించినట్లు ఆమె పేర్కొన్నారు.మండలంలో వితంతు పెన్షన్లకు 565, ఒంటరి మహిళలకు 76, వికలాంగుల పెన్షన్లకు 128, చేనేత కార్మికులకు 4, గీత కార్మికుల పెన్షన్లకు 13 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అర్హత, దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేపడుతున్నట్లు చెప్పారు.వెరిఫికేషన్ బాధ్యతలను మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌కు బిల్కల్, మల్లికార్జునగిరి, దారుగులపల్లి, పిలిగుండ్ల, కోమషేట్పల్లి గ్రామాలు; మండల విద్యాధికారి అశోక్‌కు మొగిలిగుండ్ల, జంషెడ్‌పూర్, రాంపూర్, ఘనాపూర్ గ్రామాలు; మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్‌కు పట్లూర్, నర్సాపూర్ పెద్దతండా, పంచలింగాల, నర్సాపూర్, పెద్దాపూర్ గ్రామాలు కేటాయించారు. ఉప తహసీల్దార్ పరశురాంకు కల్కోడ, బుచ్చన్‌పల్లి, దామస్తాపూర్, షాపూర్, మర్పల్లి గ్రామాలు; హౌసింగ్ ఏఈ మనోహర్‌కు కొత్లపూర్, సిరిపురం, వీర్లపల్లి, కోటమర్పల్లి, కుడుగుంట గ్రామాలు; పంచాయతీరాజ్ ఏఈ నరేందర్‌కు గుర్రంగట్టుతండా, రావులపల్లి, తుమ్మలపల్లి, తిమ్మాపూర్ గ్రామాల బాధ్యతలు అప్పగించినట్లు ఎంపీడీవో శాంతమ్మ తెలిపారు.వెరిఫికేషన్ కోసం అధికారులు గ్రామాలకు వచ్చిన సమయంలో సంబంధిత దరఖాస్తుదారులు పెన్షన్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎంపీడీవో సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


