నీట్ విజేత ‘ఇందు’కు కొండంత అండ గా సూర్యాపేట ఎస్పి 

నీట్ విజేత ‘ఇందు’కు కొండంత అండ గా సూర్యాపేట ఎస్పి 

  • పేదరికాన్ని జయించి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించిన దివ్యాంగుడి కుమార్తె
  • సోషల్ మీడియా కథనానికి స్పందించి రూ.20 వేల నగదు అందజేసిన ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్

పెన్ పహాడ్,(సూర్యాపేట): పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదని నిరూపించిన నిరుపేద విద్యార్థిని మామిడి ఇందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ కొండంత అండగా నిలిచారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన దివ్యాంగ కార్మికుడి కుమార్తె ఇందు, అంగవైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ గురుకులంలో చదివి జాతీయ స్థాయి నీట్ పరీక్షలో గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది.ఆమె ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్పీ, తక్షణమే స్పందించి తన కార్యాలయంలో రూ.20,000/- నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇందు ప్రతిభ సమాజానికే గర్వకారణమని, భవిష్యత్తు చదువులో ఎలాంటి సమస్య ఎదురైనా పోలీస్ శాఖ తరపున ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని కొండంత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు.

Views: 142

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల పురోగతిపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో...
పంచాయతీలకు నిధుల బదలాయింపుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం
పార్లమెంటు పనితీరును ప్రతిబింబించేలా మాక్ పార్లమెంట్  
అటవీ శాఖ అమరవీరుల స్మారకార్థం ర్యాలీ 
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR–2026 పురోగతిని పరిశీలించిన CEO సుధర్శన్ రెడ్డి 
నీట్ విజేత ‘ఇందు’కు కొండంత అండ గా సూర్యాపేట ఎస్పి 
మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశం