కంచన్‌పల్లిలో ఉచిత వైద్య శిబిరం
- 100 మందికి వైద్య పరీక్షలు..
- 25 మంది నుంచి టీబీ అనుమానితుల కఫం నమూనాల సేకరణ
మిడ్జిల్, : మిడ్జిల్ మండలం కంచన్‌పల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆదేశాల మేరకు కంచన్‌పల్లి గ్రామంలో శుక్రవారం జనరల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 100 మంది గ్రామస్తులు వివిధ అనారోగ్య సమస్యలతో హాజరయ్యారు.జ్వరం, దగ్గు, జలుబు, కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలతో వచ్చిన వారికి వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ పరీక్షలు చేసి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.
25 మంది నుంచి కఫం నమూనాల సేకరణ
క్యాంపులో భాగంగా క్షయ (టీబీ) వ్యాధి అనుమానితులుగా గుర్తించిన 25 మంది నుంచి కఫం (స్పుటం) నమూనాలను సేకరించారు. పరీక్షల్లో టీబీ నిర్ధారణ అయితే బాధితులకు ఆరు నెలల పాటు ఉచితంగా మందులు అందించడంతో పాటు, పౌష్టికాహారం కోసం నెలకు రూ.500 చొప్పున ఆరు నెలల పాటు ఆర్థిక సహాయం అందజేస్తారని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మీర్జా, పల్లె దవాఖానా వైద్యాధికారి డాక్టర్ శశాంక్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆయూబ్ ఖాన్, హెల్త్ అసిస్టెంట్లు దేవయ్య, సంపత్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ మోహన్‌రాజ్, ఏఎన్‌ఎం పారిజాత, ఆశా కార్యకర్తలు జుబేదా, శోభ, శిరీష, బాలమణి, లక్ష్మి, లక్ష్మమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

