స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభించిన ఎంఈఓ అజయ్ కుమార్

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభించిన ఎంఈఓ అజయ్ కుమార్

నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలను ఎంఈఓ అజయ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యతోపాటు గేమ్స్ లో కూడా విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించే పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయటం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో నిర్వహిస్తున్నట్లు, మండలంలోని ఉన్నత పాఠశాలలు నాంపల్లి, పసునూర్, ముష్టిపల్లి, మోడల్ స్కూల్, కేజీబీవీ, గాంధీజీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన లిస్టును త్వరలో తెలియజేస్తామని అన్నారు. కార్యక్రమంలో పీడీలు జి సైదులు, డి నిర్మల, ముష్టి పెళ్లి హై స్కూల్ నుండి బి దామోదర చారి, విష్ణు నారాయణ, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR–2026 పురోగతిని పరిశీలించిన CEO సుధర్శన్ రెడ్డి  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR–2026 పురోగతిని పరిశీలించిన CEO సుధర్శన్ రెడ్డి 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి  సి. సుధర్శన్ రెడ్డి, IAS, శుక్రవారం సెరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 ప్రక్రియ...
నీట్ విజేత ‘ఇందు’కు కొండంత అండ గా సూర్యాపేట ఎస్పి 
మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశం
అజయ్‌కుమార్‌కు పీహెచ్‌డీ పట్టా అందజేసిన ఉపకులపతి...
కేఎల్ఐ నీటిని వెంటనే విడుదల చేయాలి
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
స్వచ్ఛమైన గానుగ నూనె ఆరోగ్యానికి మేలు: కలెక్టర్ రాజర్షిషా