SIR హియరింగ్‌కు అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి: ఆర్‌ఐ మాధవి

SIR హియరింగ్‌కు అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి: ఆర్‌ఐ మాధవి

మహబూబ్ నగర్/ మిడ్జిల్, మిడ్జిల్: సమగ్ర సవరణ సర్వేలో భాగంగా నిర్వహించే హియరింగ్‌కు హాజరయ్యే ప్రజలు అవసరమైన పత్రాల ను సిద్ధంగా ఉంచుకోవాలని మిడ్జిల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాధవి సూచించారు. హియరింగ్ సమ యంలో సంబంధిత వ్యక్తులు తమ వద్ద ఉన్న పెన్షన్ కార్డు, ఈడీ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పత్రాలు, ఉద్యోగ హామీ పథకం కార్డు/పత్రం, జనన ధృవపత్రం, పాస్‌పోర్ట్, విద్యా ధృవపత్రాలు తదితర ఆధారాలను తీసుకు రావాలని తెలిపా రు. అలాగే 2025కు ముందు జారీ చేసిన నివాస ధృవపత్రం, కుల ధృవపత్రం, ఫ్యామిలీ రిజిస్టర్, ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన పత్రాలను కూడా అవసరాన్ని బట్టి సమర్పిం చాలని సూచించారు. హియరింగ్‌కు వచ్చే వారు అసలు పత్రాలతో పాటు అవసరమైన ప్రతులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్‌ఐ మాధవి కోరారు. అధికారులు సూచించిన పత్రాలను సమర్పించడం ద్వారా ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని తెలిపారు.

Views: 74

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!