చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) : వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు సిద్ధుల సుదర్శన్ అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా మండలంలోని తాటికొండ గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి  అన్నారు. రైతులు, కూలీల హక్కుల కోసం అహర్నిశలు పోరాటం చేసిన ధైర్యశాలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ చూపిన పోరాట మార్గం నేటి తరాలకు కూడా ఆదర్శమని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న పాలక ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు అక్కెనపల్లి అంజయ్య, గాజుల రమేష్ ,  వార్డు సభ్యులు వైట్ల బిక్షపతి, నాగరాజు, తూర్పాటి కనకయ్య, శ్రీనివాస్, గయాస్, రాజు, అక్బర్, ఎండి సలీం, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Views: 81

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు