తుంగతుర్తిలో వీరనారి చాకలి అవిలమ్మకు ఘన నివాళి

దొరల దోపిడీకి ఎదురొడ్డి పోరాడిన అవిలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం: తాటికొండ సీతయ్య

తుంగతుర్తిలో వీరనారి చాకలి అవిలమ్మకు ఘన నివాళి

తుంగతుర్తి :  తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి చిట్యాల అవిలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తుంగతుర్తి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. దొరల పెత్తనం, దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి అవిలమ్మ త్యాగాలు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.ఇసునూరు దేశ్‌ముఖ్‌ ఆగడాలను ఎదిరిస్తూ, తన పంట పొలంలో పండిన పంటను అక్రమంగా దోచుకునేందుకు వచ్చిన గుండాలను ఎదుర్కొని పోరాడిన ధీరవనిత చాకలి అవిలమ్మ అని కొనియాడారు.ఆమె చూపిన ధైర్యం, తెగువ, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్‌, పట్టణ అధ్యక్షులు గొప్పగాని శ్రీనివాస్‌, గోపగాని వెంకన్న, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, మల్లేపాక రాములు, గడ్డం సోమేష్‌, పాలడుగు జాలంధర్‌, తాళ్లపెల్లి యాకయ్య, బొజ్జ సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు