INTUC ఆధ్వర్యంలో NSUI నూతన జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ కు ఘన సన్మానం
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో INTUC ఆధ్వర్యంలో NSUI నూతన జిల్లా అధ్యక్షులు యశ్వంత్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా INTUC తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు NSUI జిల్లా అధ్యక్షులుగా యశ్వంత్ గారిని నియమించినందుకు అచ్చంపేట INTUC తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి మంచి గుర్తింపు ఉంటుందని, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి నాయకత్వంలో పని చేస్తున్నందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వంగా ఉందని, కాలర్ ఎగరేసి నేను కాంగ్రెస్ కార్యకర్తను అని చెప్పుకునే ధైర్యం ఉందని, ఇదే కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో INTUC తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, తాలూకా కార్యదర్శి శ్రీరామ్ నాయక్, టౌన్ అధ్యక్షులు సలేశ్వరం, బల్మూర్ మండల అధ్యక్షులు చందు నాయక్, అచ్చంపేట మండల అధ్యక్షులు మౌలానా, బల్మూర్ మండల ఉపాధ్యక్షులు రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోతిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


