పెన్షనర్ల EHS కార్డుల సమస్యలకు చెక్ పెట్టాలి

పెన్షనర్ల EHS కార్డుల సమస్యలకు చెక్ పెట్టాలి

  • రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లకు EHS కార్డులు ఇవ్వాలి
  • సాఫ్ట్‌వేర్ లోపాలతో పెన్షనర్లకు తప్పని తిప్పలు

 హుస్నాబాద్: అప్లోడింగ్, ఎడిట్ సమస్యలు వెంటనే పరిష్కరించాని,రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా పెన్షనర్ల నూతన EHS హెల్త్ కార్డుల కోసం వివరాలు అప్లోడ్ చేసే సమయంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందిస్తున్న విధంగానే రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లకు కూడా EHS కార్డులు అందించాలని కోరారు. కుటుంబ సభ్యుల వివరాలు అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతున్నాయని, ఎంప్లాయ్ ఐడీ ఆధారంగా అర్హులైన కుటుంబ సభ్యుల వివరాలను సులభంగా ఆమోదించేలా సాఫ్ట్‌వేర్‌ను సరళతరం చేయాలని అన్నారు. కార్డు డౌన్‌లోడ్ అనంతరం ఫొటో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించాలని సూచించారు.మహిళా సర్వీస్ పెన్షనర్ల భర్త వివరాలు నమోదు చేసే సమయంలో వయస్సు నిబంధనల కారణంగా అప్లోడ్ రిజెక్ట్ అవుతున్న సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. ఎంప్లాయ్ ఐడీ ఆధారంగా స్పౌజ్ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పెన్షనర్ల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని EHS కార్డుల ప్రక్రియను సులభతరం చేయాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు సకాలంలో అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
ఎల్బీనగర్,: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ చౌరస్తా గాంధీ సెంటర్ లో నాగోల్ రజక సంఘం ఆధ్వర్యంలో బొడ్డుపల్లి...
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు 
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభించిన ఎంఈఓ అజయ్ కుమార్